Page Loader
Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ 
గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ

Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ కీలక పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ 20 పరుగుల తేడాతో ఓటమిపాలై ఐపీఎల్‌ నుండి బయటపడింది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయం ప్రకారం, గుజరాత్‌ టైటాన్స్‌ మిడిల్‌ ఆర్డర్‌ విఫలం కావడం వల్లే ఈ కీలక మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. జట్టుకు నాణ్యమైన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ అత్యవసరమని ఆయన సూచించారు. టామ్‌ మూడీ వివరించేందుకు, రూథర్‌ఫోర్డ్‌, తెవాతియా ఇద్దరికీ జట్టులో ఒకే రకమైన పాత్రలు ఉన్నప్పటికీ, వారు భిన్న శైలిలో ఆట ఆడతారు. సిక్స్‌లు కొట్టడంలో ఇద్దరూ పోటీగా ఉంటారు.

Details

నాణ్యమైన మిడిలార్డర్ లో ఉండాలి

అయితే ముంబయితో జరిగిన మ్యాచ్‌లో వీరు 26 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే సిక్స్‌ మాత్రమే కొట్టగలిగారు. అంతేకాదు, వారు చివరి ఓవర్లలో బ్యాటింగ్‌ చేశారు. అలాంటి కీలక సందర్భాల్లో ఫోర్లు, సిక్స్‌ల రూపంలో పరుగులు సాధించాలి, కానీ ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. వాషింగ్టన్‌ సుందర్‌ ప్రత్యేక పాత్ర పోషించేందుకు బ్యాటింగ్‌కు ముందొచ్చినా, మిడిల్‌ ఆర్డర్‌లో అవసరమైన నాణ్యమైన భారత బ్యాటర్‌ జట్టు వద్ద ఉండాలని టామ్‌ మూడీ పేర్కొన్నారు. అలాంటి బ్యాటర్‌ ఉంటే జట్టు సమతుల్యం మెరుగ్గా ఉంటుందన్నారు.

Details

మిడిలార్డర్లకు బ్యాటింగ్ అవకాశం ఎక్కువగా లభించలేదు

ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, జోస్ బట్లర్‌ త్రయం ముందుండి నడిపించింది. అయితే, ఈ సీజన్‌లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌కు ఎక్కువ అవకాశం దక్కలేదు. వాషింగ్టన్‌ సుందర్‌, సాయి సుదర్శన్‌ల వికెట్లు కోల్పోయిన తర్వాత, 229 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ మిడిల్‌ ఆర్డర్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌, రాహుల్ తెవాతియా, ఎం. షారుఖ్ ఖాన్ ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ దాడిని సాహసంగా ఎదుర్కోలేకపోయారు.