
IPL: చితక్కొట్టిన బట్లర్.. ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
నరేంద్ర మోడీ స్టేడియం,అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి గ్రాండ్ విక్టరీ తమ ఖాతాలో వేసుకుంది.
204 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ముందుగా టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది.
ఢిల్లీ బ్యాటర్లలో కొంతమంది మాత్రమే మినహా మిగతావాళ్లంతా మంచి ప్రదర్శన చూపించారు.
కరుణ్ నాయర్ 31 పరుగులు చేయగా,అక్షర్ పటేల్ 39 పరుగులతో మెరిపించాడు.
అలాగే అశుతోష్ శర్మ 37, స్టబ్స్ 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టారు.
వివరాలు
కీలక సమయంలో 43 పరుగులు చేసిన రూథర్‌ఫర్డ్
ఈ విధంగా ఢిల్లీ జట్టు 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి మొత్తం 203పరుగులు చేసింది.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ అత్యుత్తమ ప్రదర్శన చూపించి నాలుగు వికెట్లు తీసాడు. అతని తోడుగా సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్, సాయి కిషోర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు క్రీజులోకి దిగారు.
ఓపెనర్ సాయి సుదర్శన్ 36 పరుగులు చేయగా,జాస్ బట్లర్ అద్భుతంగా ఆడి 97పరుగులు సాధించాడు.
రూథర్‌ఫర్డ్ కూడా కీలక సమయంలో 43 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్,ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.ఇక శుభ్‌మన్ గిల్‌ను కరుణ్ నాయర్ రన్ ఔట్ చేయడం జరిగింది.