NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / విజయశంకర్ సునామీ ఇన్నింగ్స్ .. కోల్ కతాపై గుజరాత్ టైటాన్స్ విజయం
    తదుపరి వార్తా కథనం
    విజయశంకర్ సునామీ ఇన్నింగ్స్ .. కోల్ కతాపై గుజరాత్ టైటాన్స్ విజయం
    రాణించిన గిల్, విజయశంకర్

    విజయశంకర్ సునామీ ఇన్నింగ్స్ .. కోల్ కతాపై గుజరాత్ టైటాన్స్ విజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2023
    08:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈడెన్ గార్డన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

    దీంతో గుజరాత్ హాట్రిక్ విజయాలు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది.

    కోల్ కతా బ్యాటర్లలో గుర్బాజ్‌ (39 బంతుల్లో 81, 5ఫోర్లు, 7 సిక్స్‌లు), ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

    నితీష్ రాణా(4), వెంకటేష్ అయ్యర్(11), జగదీషన్ 19 పరుగుల నిరాశపరిచారు. మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో చివర్లో కోల్ కతా భారీ స్కోరును చేయలేకపోయింది.

    గుజరాత్ బౌలర్లలో షమీ 3, లిటిల్, నూర్ఆహ్మద్ తలా రెండు వికెట్లతో రాణించారు.

    Details

    ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ విజయం

    అండ్రీ రస్సెల్, రషీద్ ఖాన్ కి ఇది వందో టీ20 కావడం విశేషం.

    లక్ష్య చేధనలో గుజరాత్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 49 పరుగులతో రాణించగా.. చివర్లో విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించడంతో గుజరాత్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

    విజయశంకర్ 24 బంతుల్లో 51 పరుగులు, డేవిడ్ మిల్లర్ 18 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

    కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్, హర్షత్ రానా, అండ్రూ రస్సెల్ తలా ఓ వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ టైటాన్స్
    కోల్‌కతా నైట్ రైడర్స్

    తాజా

    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    గుజరాత్ టైటాన్స్

    IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి! ఐపీఎల్
    IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..! క్రికెట్
    ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్
    ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..! ఐపీఎల్

    కోల్‌కతా నైట్ రైడర్స్

    షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్ ఐపీఎల్
    కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా? క్రికెట్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? ఐపీఎల్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025