Page Loader
WPL : టాస్ నెగ్గిన గుజరాత్.. గెలిస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు
తన చివరి మ్యాచ్‌లో 68 పరుగులు చేసిన లారా వోల్వార్డ్

WPL : టాస్ నెగ్గిన గుజరాత్.. గెలిస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 17వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని కైవసం చేసుకోవాలని యూపీ వారియర్స్ భావిస్తోంది. నేడు బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గుజారత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ రాణా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో రెండింట్లో నెగ్గిన గుజరాత్ జెయింట్స్ కు ఫ్లేఆఫ్స్ చేరడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌లలో మూడు గెలిచిన యూపీ వారియర్స్.. నేడు గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ఫ్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

గుజరాత్ జెయింట్స్

ఇరు జట్లలోని సభ్యులు

ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టులో సబ్బినేని ఘేఘన స్థానంలో మోనికా పటేల్ తుది జట్టులోకి వచ్చింది. యూపీ వారియర్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. యూపీ జట్టు : అలీస్సీ హేలీ (కెప్టెన్), దేవికా వైద్య, తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హరీస్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, అంజలి శర్వణి, పర్శవి చోప్రా,కిరణ్ నవ్‌గిరె, సోఫీ ఎకిల్‌స్టోన్, రాజేశ్వరి గైక్వాడ్ గుజరాత్ జట్టు: స్నేహ్ రాణా (కెప్టెన్), సోఫీ డంక్లీ, లారా వోల్వార్డ్ట్, హర్లీన్ డియోల్, డయాలన్ హేమలత, ఆష్లే గార్డ్‌నర్, మోనికా పటేల్, సుష్మా వర్మ, అశ్వని కుమారి, కిమ్ గార్త్, తనూజా కన్వర్