Page Loader
Gukesth-World Championship : చరిత్ర సృష్టించనున్న గ్రాండ్​ మాస్టర్​ గుకేష్ దొమ్మరాజు
చదరంగం ఆటలో నిమగ్నమైన గుకేష్​ దొమ్మరాజు

Gukesth-World Championship : చరిత్ర సృష్టించనున్న గ్రాండ్​ మాస్టర్​ గుకేష్ దొమ్మరాజు

వ్రాసిన వారు Stalin
Apr 22, 2024
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రాండ్ మాస్టర్(Grand master) గుకేష్ దొమ్మరాజు(Gukesh Dommaraju)చరిత్ర సృష్టించనున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీ(World Championship tourney)లో పాల్గొనే అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించనున్నాడు. గుకేష్ గనుక వరల్డ్ ఛాంపియన్ టైటిల్ గెలిస్తే కేవలం 17 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచే అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిలో కోసం ఈ ఏడాది ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ (Ding Liren)తో తలపడనున్నాడు. అంతకుముందు కెనడా(Canada)లో జరిగిన 14 రౌండ్ల చెస్ టోర్నమెంట్ లో గుకేష్ దొమ్మరాజు చెస్ ఛాంపియ న్​ గా నిలిచాడు. అమెరికాకు చెందిన గ్రాండ్ మాస్టర్ హికారు నకామురతో జరిగిన ఆఖరి రౌండ్ మ్యాచ్ ను గుకేష్ దొమ్మరాజు డ్రా చేసుకున్నాడు.

Chess-World Championship

కాస్పొరోవ్​, కార్ల్​ సెన్​ లు 22 ఏళ్లకే టైటిల్​... 

గ్రాండ్ మాస్టర్స్ ఫాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చి మధ్య జరిగిన గేమ్ కూడా డ్రా గా ముగిసింది. దీంతో టైటిల్ ను కైవశం చేసుకునేందుకు కరువానా, ఇయాన్ ల మధ్య మ్యాచ్ డ్రా కావడం గుకేష్ కు కలిసొచ్చింది. డింగ్ లిరెన్ తో గుకేష్ తలపడితే అత్యంత పిన్నవయసులోనే ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొన్న వాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్, లేదా మాగ్నస్ కార్ల్ సెన్ లు ప్రపంచ ఛాంపియన్ లుగా అవతరించినప్పుడు వారి వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రాండ్​ మాస్టర్​ గుకేష్​ దొమ్మరాజు