సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్
తెలుగు క్రికెటర్ హనుమ విహారిని కెప్టెన్‌గా నియమిస్తూ సౌత్‌జోన్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సౌత్ జోన్ అసోసియేషన్ ప్రకటించింది. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడిన వికెట్ కీపర్ కేఎస్ భరత్, రికీ భుయ్, తిలక్ వర్మ జట్టులో స్థానం దక్కించుకోగా.. కర్నాటక బ్యాటర్ మయాంక్అగర్వాల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. విదేశాల్లో మంచి రికార్డు ఉన్న హనుమ విహారి 2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచులోనూ సత్తా చాటాడు. ఓటమి అంచుల్లో ఉన్న ఆంధ్రా జట్టును కాపాడేందుకు కుడి చేతికి గాయం కావడంతో ఎడమ చెత్తో బ్యాటింగ్ చేశాడు.
2023 టోర్నీకి సౌత్ జోన్ టీమ్ ఇదే!
దీంతో క్రికెట్ అభిమానులు హనుమ విహారి ఆటకు ఫిదా అయిపోయారు. ఐపీఎల్ లో రాణించిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ దులీప్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. కేరళ బ్యాటర్ సచిన్ బేబీ, గోవా బ్యాటర్ దర్శన్ మిసాల్‌లకు సౌత్ జోన్ టీమ్‌లో చోటు లభించింది. దులీప్ ట్రోఫీ ఎంపికైన జట్టు హనుమ విహారి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిక్కీ భుయ్, శ్రీకర్ భరత్, ఆర్ సమర్థ్, వాషింగ్టన్ సుందర్, సచిన్ బేబీ, ప్రదోశ్ రంజన్ పాల్, సాయి కిషోర్, వీ కవేరప్ప, విజయ్‌కుమార్ వైశాక్, కేవీ శశికాంత్, దర్శన్ మిసాల్, తిలక్ వర్మ