హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. చాహల్‌కు అందుకే మొండిచేయి చూపించారేమోనని అసంతృప్తి
టీమిండియా సెలెక్టర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో, అందుకే ఎంపిక చేయట్లేదని బాంబు పేల్చాడు. వరల్డ్ కప్-2023కి ముందు భారత్, కంగారులను 3 వన్డేల సిరీస్‌తో ఢీ కొట్టనుంది. సోమవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అనుహ్యంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటుకల్పించిన సెలెక్టర్లు, మరో స్పిన్నర్ చాహల్‌ను మాత్రం ఎంపికచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అశ్విన్ సహా సుందర్‌కు సైతం చోటు దక్కిన నేపథ్యంలో ఆసీస్ సిరీస్‌కు చాహల్ సెలెక్ట్ కాకపోవడంపై భజ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిభ కోసమే ఎంపిక జరిగితే చాహల్ ఉండాల్సిందే : హర్భజన్
యుజ్వేంద్ర చాహల్ ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో తుది జట్టులో ఉండాల్సిందని, అతడికి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదో అర్ధం కావట్లేదని భారత మాజీ స్టార్ స్పిన్నర్ అన్నారు. ఈ ఆఫ్ స్పిన్నర్, చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడా, లేక ఎవరినైనా దురుసు మాటలు అన్నాడా అన సంగతి తెలియదన్నారు. కేవలం ప్రతిభ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తే, చాహల్‌కు తప్పకుండా చోటు దక్కుతుందన్నారు. కీలక ఆటగాళ్లు అంతా రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో చాహల్ జట్టులో ఉంటాడని తాను భావించానన్నారు. మేనెజ్‌మెంట్ హాఫ్ స్పిన్నర్ల కోసం వెతుకుతున్నట్లు అర్థమవుతోందని, ఈ నేపథ్యంలోనే ప్రపంచకప్ ప్లాన్ లో మార్పులు జరిగాయన్నారు. ఫలితంగానే అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌కు మరోసారి పిలుపువచ్చిందని భజ్జీ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.