Page Loader
టీ20 కెప్టెన్‌గా హార్ధిక్.. బిగ్ హిట్టర్‌కి ఛాన్స్!
టీమిండియా బ్యాటర్ హార్ధిక్ పాండ్యా

టీ20 కెప్టెన్‌గా హార్ధిక్.. బిగ్ హిట్టర్‌కి ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 19, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20 మ్యాచులను ఆడనుంది. ఈ సిరీస్ మొత్తానికి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. బీజీ షెడ్యూల్‌తో అలసిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు ఈ పర్యటన మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు ఐపీఎల్‌లో సత్తా చాటిన రింకూసింగ్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Details

వెస్టిండీస్ తలపడే భారత్ జట్టు ఇదే?

ఈనెల 27న వెస్టిండీస్ తో జరిగే టెస్టు, వన్డే, టీ20ల జట్లను బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ టీ20ల్లో ఫార్మాట్లో ఓపెనర్లుగా శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ ఎంపికవ్వనుండగా బ్యాకప్‌గా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌ను తీసుకోనున్నారు. సీనియర్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనుండగా.. సంజూ శాంసన్ బ్యాకప్ కీపర్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక ఆల్ రౌండర్లుగా హార్ధిక్, రింకూసింగ్ కు ఛాన్స్ దక్కనుంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు(అంచనా) శుభ్‌మన్‌గిల్, ఇషాన్‌కిషన్, గైక్వాడ్, జైస్వాల్, సూర్యకుర్‌యాదవ్, సంజూ శాంసన్/జితేశ్‌శర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అక్షర్ పటేల్, రింకూసింగ్, చాహల్, కుల్దీప్‌యాదవ్, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్‌సింగ్, ఉమ్రాన్ మాలిక్/ శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.