Page Loader
IND VS ENG: విరాట్‌ కోహ్లిని అధిగమించిన హార్దిక్‌ పాండ్యా
IND VS ENG: విరాట్‌ కోహ్లిని అధిగమించిన హార్దిక్‌ పాండ్యా

IND VS ENG: విరాట్‌ కోహ్లిని అధిగమించిన హార్దిక్‌ పాండ్యా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
10:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో, టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 53 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి, టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పాండ్యా, భారత్ తరఫున డెత్ ఓవర్లలో (16 నుంచి 20 ఓవర్ల వరకు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డును సాధిస్తూ, పాండ్యా, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ కోహ్లి డెత్ ఓవర్లలో 192.54 స్ట్రైక్‌రేట్‌తో 1032 పరుగులు సాధించగా, పాండ్యా 174.24 స్ట్రైక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.