Page Loader
Hardik Pandya : 'ఐయామ్ బ్యాక్'.. ముంబై జట్టులోకి తిరిగి రావడంపై స్పందించిన హార్ధిక్ పాండ్యా
'ఐయామ్ బ్యాక్'.. ముంబై జట్టులోకి తిరిగి రావడంపై స్పందించిన హార్ధిక్ పాండ్యా

Hardik Pandya : 'ఐయామ్ బ్యాక్'.. ముంబై జట్టులోకి తిరిగి రావడంపై స్పందించిన హార్ధిక్ పాండ్యా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2023
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మళ్లీ సొంత గూటికి వచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హర్థిక్ పాండ్యా తిరిగి మళ్లీ ముంబాయి ఇండియన్స్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ పద్ధతి ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను ముంబై ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. ముంబై క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా రూ.15 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించి తీసుకుంది. తిరిగి ముంబై జట్టులోకి రావడంపై హార్దిక్ తొలిసారి స్పందించాడు.

Details

క్రికెట్ జర్నీ మొదలైన చోటుకే మళ్లీ రావడం సంతోషంగా ఉంది : హర్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ జట్టుకు తిరిగి రావడం సంతోషంగా ఉందని, ఇది తనకు చాలా ప్రత్యేకమని హార్దిక్ పాండ్యా చెప్పారు. తన క్రికెట్ జర్నీ 2015లో ముంబైతోనే ప్రారంభమైందని గుర్తు చేశాడు. ప్రయాణం మొదలైన చోటుకే మళ్లీ తిరిగి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏడు సీజన్ల పాటు ముంబయి ఇండియన్స్ కు ఆడిన హార్దిక్ పాండ్యా 2022లో గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లాడు. పాండ్యా కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది.