Page Loader
Tilak Varma: హ్యాట్రిక్ సెంచరీలు.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా తిలక్ వర్మ కొత్త రికార్డు
హ్యాట్రిక్ సెంచరీలు.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా తిలక్ వర్మ కొత్త రికార్డు

Tilak Varma: హ్యాట్రిక్ సెంచరీలు.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా తిలక్ వర్మ కొత్త రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2024
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ మంచి జోరు మీద ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లలో వరుస సెంచరీలు సాధించిన ఈ యువ ఆటగాడు, ఇప్పుడు మళ్లీ మరో విధ్వంసకర సెంచరీతో టీ20ల్లో వరుసగా మూడో సెంచరీని బాదాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో తన మూడో సెంచరీను నమోదు చేశాడు. ఈ మ్యాచ్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ కేవలం 67 బంతుల్లో 151 పరుగులు చేశారు. ఇందులో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో అద్భుతంగా ఆడిన తిలక్ వర్మ, 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి, 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

Details

తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్

తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో, హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రపంచ క్రికెట్‌లో వరుసగా మూడు టీ20 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డ్‌ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కూడా నమోదు చేశాడు. దీంతో ముంబై బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రికార్డును బద్దలు కొట్టాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టిన తిలక్ వర్మ