Manjrekar: హెడ్‌ను తొందరగా ఔట్ చేయాలి.. అదే టీమిండియా విజయరహస్యం!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా సమరానికి సిద్ధమవుతున్నాయి.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మెగా టోర్నీల్లో దూకుడుగా ఆడే ఆసీస్‌ను ఓడించడం అంత సులభం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా, ఆసీస్ బ్యాటింగ్‌లో కీలక ఆటగాడైన ట్రావిస్ హెడ్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపితే, టీమిండియా విజయానికి అర్థభాగం పూర్తయినట్లేనని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
భారత బౌలర్లు ప్రధాన లక్ష్యంగా ట్రావిస్ హెడ్‌ను తొందరగా ఔట్ చేయాలని. ఆసీస్ తరఫున అతడు రెచ్చిపోతే భారత్‌కు కష్టాలు తప్పవన్నారు.
చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకూడదని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
Details
తుది జట్టులో జేక్‌కి అవకాశం ఇవ్వాలి
ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ షార్ట్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.
అతడి స్థానంలో కూపర్ జట్టులోకి వచ్చినా, తుది జట్టులో మాత్రం యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను తీసుకోవాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు.
జేక్ ఇప్పటికే ఆసీస్ స్క్వాడ్‌లో ఉన్నాడు. అతడికి తుది జట్టులో చోటు కల్పించాలి. అతనికి మద్దతుగా నిలిస్తే మ్యాచ్‌లో కీలక ప్రదర్శన ఇవ్వగలడని పాంటింగ్ పేర్కొన్నాడు.