LOADING...
CSK Vs MI Weather Report: ఇవాళ చెన్నై వేదికగా సిఎస్‌కే, ఎంఐ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌
ఇవాళ చెన్నై వేదికగా సిఎస్‌కే, ఎంఐ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌

CSK Vs MI Weather Report: ఇవాళ చెన్నై వేదికగా సిఎస్‌కే, ఎంఐ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబయి ఇండియన్స్ (MI) జట్లు నేడు చెన్నైలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియం వేదికగా తలపడనున్నాయి. సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సొంత మైదానంలో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్‌కే బరిలోకి దిగనుంది. వాతావరణ పరిస్థితి వాతావరణ శాఖ ప్రకారం చెన్నైలో వర్షం పడే అవకాశముంది. అయితే మ్యాచ్ ప్రారంభ సమయానికి వాన తగ్గే అవకాశముందని అంచనా వేస్తోంది. మ్యాచ్ వాష్ అవుట్ కాకపోయినా, మైదానం తడిగా ఉండటం వల్ల ఆటకు కొంత ఆలస్యం కావొచ్చు.

Details

 చెపాక్ పిచ్ రిపోర్ట్ 

చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ గడిచే కొద్దీ పిచ్ నెమ్మదించడంతో స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాతావరణం తేమగా ఉంటే మ్యాచ్ మలి దశల్లో బౌలింగ్‌పై ప్రభావం పడనుంది. సీఎస్‌కే స్పిన్ త్రయం రెడీ చెపాక్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని సీఎస్‌కే జట్టు స్పిన్ త్రయంగా నూర్ అహ్మద్, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజాతో సిద్ధంగా ఉంది. చెపాక్ వేదికగా ఇప్పటివరకు 85 మ్యాచుల్లో 49 మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఎక్కువగా ఉంది.

Details

గాయాలతో ఆటగాళ్లు దూరం 

ఎంఐ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ నిషేధం కారణంగా అందుబాటులో ఉండడం లేదు. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం ఎంఐ అభిమానులకు నిరాశ కలిగించింది. గత సీజన్ ఫెయిల్యూర్‌ గత సీజన్‌లో సీఎస్‌కే, ఎమ్ఐ ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. సీఎస్‌కే చివరి మ్యాచ్‌లో ఓడిపోగా ఎంఐ పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. హైవోల్టేజ్ పోరుకు అభిమానుల్లో ఉత్కంఠ 2013 నుంచి ఇప్పటి వరకు ఎంఐ తమ ఆరంభ మ్యాచుల్లో గెలవలేదు. ఈసారి ఆ బాదుడి నుంచి బయటపడేందుకు పట్టుదలతో ఉంది. నేటి మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ పీక్‌ స్టేజ్‌లో ఉంది.