చర్రిత సృష్టించిన బెన్ స్టోక్స్.. ప్రపచంలోనే రెండో క్రికెటర్‌గా రికార్డు
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త చరిత్రను లిఖించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న మూడో వన్డేల్లో శతకం బాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టోక్స్ రీ ఎంట్రీ మ్యాచులో విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. కివీస్ నాలుగు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వన్డేలో స్టోక్స్ 52 పరుగులు చేయగా, రెండో వన్డే కేవలం ఒక్క పరుగుకు ఔట్ అయ్యాడు. ఇక మూడో వన్డేలో బౌండరీల వర్షం కురిపించి 124 బంతుల్లోనే 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 రన్స్ చేశాడు. దీంతో వన్డేల్లో ఇంగ్లండ్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.
బెన్ స్టోక్స్ సాధించిన రికార్డులివే
ఇక జాసన్ రాయ్ 2018 ఆస్ట్రేలియాపై 180 పరుగులు చేసిన రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. వన్డేల్లో నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్ బెన్ స్టోక్స్ నిలిచారు. విండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ 189 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇంగ్లాండ్ తరుఫున 3వేల పరుగులు పూర్తి చేసిన 19వ ఆటగాడిగా స్టోక్స్ నిలిచారు. ఇందులో నాలుగు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలను బాదాడు. వన్డేల్లో ఇంగ్లాండ్ తరుఫున 3వేల పరుగులు, 50 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇక స్వదేశంలో 2వేల పరుగుల మార్కును స్టోక్స్ అందుకోవడం విశేషం.