Page Loader
International Cricket Balls: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో వాడే SG బంతుల గురించి తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో వాడే SG బంతుల గురించి తెలుసా?

International Cricket Balls: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో వాడే SG బంతుల గురించి తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ స్పోర్ట్స్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం అత్యుత్తమ నాణ్యత కలిగిన క్రీడా పరికరాలు, ముఖ్యంగా క్రికెట్ పరికరాలను తయారు చేయడంలో గుర్తింపు పొందింది. ఈ రంగంలో టాప్ కంపెనీల్లో శాన్స్ పేరిల్ గ్రీన్‌ల్యాండ్స్ (SG) ఒకటి. ఈ సంస్థ ప్రపంచ స్థాయి క్రికెట్ బాల్స్ తయారీలో ప్రఖ్యాతి గడించింది. భారత్‌లోని అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎక్కువగా ఎస్జీ బాల్స్‌నే వినియోగిస్తారు. ఇప్పుడు ఈ SG క్రికెట్ బాల్స్ తయారీ గురించి తెలుసుకుందాం.

వివరాలు 

దేశీయ సీజన్‌లో ఎక్కువగా ఉపయోగించే SG బంతులు 

SG మార్కెటింగ్ టీమ్‌లోని శివం శర్మ మాట్లాడుతూ, ఈ బంతులు భారతదేశమంతా అమ్ముడవుతాయని, కంపెనీకి దేశవ్యాప్తంగా డీలర్లు ఉన్నారని తెలిపారు. ఈ బంతులను అన్ని టెస్ట్ మ్యాచ్‌లలో ఉపయోగిస్తారు.అలాగే దేశీయ సీజన్‌లోనూ ఈ SG బంతులు ఎక్కువగా వినియోగిస్తారు. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కూడా ఈ బంతులను ఉపయోగిస్తారు. రిషబ్ పంత్, హర్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సంజు శాంసన్ వంటి ప్రముఖ క్రికెటర్లు SG ప్రొడక్టులను వాడతారని శివం తెలిపారు.

వివరాలు 

తొలిసారిగా పింక్ బాల్ తయారీ

కొంత కాలం క్రితం వరకు ఈ కంపెనీ రెండు రకాల బంతులను మాత్రమే తయారు చేస్తుండగా, ఇప్పుడు మూడు రకాల బంతులను తయారు చేస్తోంది. SG మొదటిసారిగా పింక్ బాల్‌ను పరిచయం చేసింది. ఈ రకాల బంతుల్లో రెడ్, వైట్, పింక్ వేరియంట్లు ఉన్నాయి. రెడ్ బాల్‌ను టెస్ట్ మ్యాచ్‌లలో, వైట్ బాల్‌ను టీ20 టోర్నమెంట్లలో ఉపయోగిస్తారు. కోల్‌కతాలో జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మొదటిసారిగా ఈ పింక్ బాల్ ఉపయోగించారు.

వివరాలు 

ఎస్జీ బంతులు ఎలా తయారు చేస్తారు? 

SG క్రికెట్ బాల్ తయారీ ప్రక్రియ చాలా సుదీర్ఘం. ఎంతో మంది కళాకారుల చేతిపనితోనే ఈ బంతి తయారు అవుతుంది. బాల్ పూర్తయ్యే వరకూ దాదాపు 12 నుంచి 15 మంది కళాకారులు ముడి పదార్థాన్ని కత్తిరించడం, ఆకృతిలోకి తీసుకురావడం, కలిపి కుట్టడం వంటి వివిధ దశల్లో పనిచేస్తారు. చివరగా మార్కెట్లోకి పంపించే ముందు బంతిని పాలిష్ చేస్తారు.

వివరాలు 

SG ప్రారంభం గురించి..

SG మేనేజింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్, తన తాతగారు 1939లో క్రికెట్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారని తెలిపారు. విభజన సమయంలో వారి కుటుంబం సియాల్‌కోట్ నుంచి భారత్‌కు రావడం, అనంతరం క్రికెట్ ఉత్పత్తులపై దృష్టి పెట్టడం జరిగిందని వివరించారు. కుటుంబ సభ్యులంతా నాణ్యత విషయంలో రాజీ లేకుండా కష్టపడినట్లు తెలిపారు. నేటికీ కుటుంబం సంప్రదాయంతో పాటు కొత్త ఆలోచనలను కూడా తీసుకొస్తున్నట్లు ఆనంద్ చెప్పారు. SG క్రికెట్ బంతుల విశేషాలు: SG ఫ్యాక్టరీలో రోజూ సుమారు 1,500 క్రికెట్ బంతులు తయారవుతుంటాయి. దీని ప్రారంభ ధర రూ.600 ఉండగా, ప్రొఫెషనల్ మ్యాచ్‌లలో ఉపయోగించే హై-ఎండ్ మోడల్ ధర రూ.4,500 ఉంటుంది.