Hardik Pandya: హార్ధిక్ పాండ్యా విషయంలో వీడని సస్పెన్స్.. మళ్లీ ముంబై గూటికి వెళ్లడం ఖాయమే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వచ్చే ఏడాది సీజన్ కోసం జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హర్థిక్ పాండ్యా పాత టీమ అయిన ముంబై ఇండియన్స్ వెళ్లనున్నాడని కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముంబై లిస్టులో హార్దిక్ పేరు ఉంటుందని అంతా భావించినా, అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యాను రిటైన్ చేసుకుంది. దీంతో మళ్లీ కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్ లోకి హార్దిక్ పాండ్యాను ట్రైడ్ చేసుకోవడం పూర్తయిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో తన పాత టీమ్ తరుఫునే హార్దిక్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే
అయితే ఆటగాళ్ల ట్రేడింగ్ కోసం ఫ్రాంచేజీలకు డిసెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ముంబై రిటైన్ చేసిన ఆటగాళ్లు వీరే రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, క్యామ్ గ్రీన్, షామ్స్ ములానీ, వధేరా, బుమ్రా, కుమార్ కార్తికేయ, చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్, రొమారియో షెపర్డ్ విడుదల: అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్, ఝే రిచర్డ్‌సన్, మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.
గుజరాత్ టైటాన్స్ వదులుకున్న ఆటగాళ్ల వీరే
గుజరాత్ టైటాన్స్: రిటైన్డ్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, ఎవరూ , R సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ. విడుదల: యష్ దయాల్, KS భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దాసున్ షనక.