Loading...
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్?.. ఐపీఎల్ 2027కు సూర్యకుమార్ యాదవ్ దూరం!
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్?.. ఐపీఎల్ 2027కు సూర్యకుమార్ యాదవ్ దూరం!

Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్?.. ఐపీఎల్ 2027కు సూర్యకుమార్ యాదవ్ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి వస్తున్న ఓ వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్ 2027సీజన్‌కు ఆయన పూర్తిగా దూరంగా ఉండొచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త నిజమైతే, ముంబై ఇండియన్స్‌తో దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ఆయన అనుబంధంలో ఇది ఊహించని మలుపుగా మారనుంది. ముంబై ఇండియన్స్ విజయాల్లో ఎన్నో సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్న సూర్యకుమార్ యాదవ్, తన వినూత్న షాట్లతో 'మిస్టర్ 360'గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. అలాంటి ఆటగాడు ఐపీఎల్‌కు దూరమవుతాడనే వార్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ ఆడే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు, సిక్సర్ల వర్షాన్ని ఇక చూడలేమా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు

నిర్ణయం వెనుక అంతర్జాతీయ ప్రణాళికలేనా?

సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో పాటు వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఎన్నో సంవత్సరాలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండటంతో శరీరంపై పడుతున్న ఒత్తిడిని తగ్గించుకోవడం, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం, అలాగే భారత్ తరఫున రాబోయే ప్రధాన ఐసీసీ టోర్నీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఐపీఎల్ 2027కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు

ముంబై మిడిల్ ఆర్డర్‌కు కొత్త సవాల్

సూర్య నిజంగానే జట్టుకు దూరమైతే, ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు అది పెద్ద సవాలుగా మారనుంది.

మిడిల్ ఆర్డర్‌లో ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు.

రాబోయే వేలంలో ఆయన స్థానానికి సరిపోయే నాణ్యమైన భారతీయ బ్యాటర్‌ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయడంలో సూర్యకుమార్ పోషించే పాత్రను భర్తీ చేయడం కష్టమేనని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

అభిమానుల్లో ఆందోళన

ముంబై ఇండియన్స్‌తో భావోద్వేగ అనుబంధం ఏర్పరుచుకున్న సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరమవుతాడనే ప్రచారం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

ముంబై జెర్సీలో ఆయనను మళ్లీ చూడలేమనే ఆలోచనే వారిని కలవరపెడుతోంది.

మరోవైపు, సూర్య నిర్ణయం అధికారికంగా ఖరారైతే దానిని గౌరవిస్తూ, ఆయన స్థానాన్ని భర్తీ చేసే యువ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు ముంబై యాజమాన్యం వ్యూహాలు రూపొందించే అవకాశం ఉందని సమాచారం.

ADVERTISEMENT