Page Loader
హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!
కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం

హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి ముందే దేశంలోని స్టేడియాలు కొత్త హంగులతో తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది. కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేయడంతో బోర్డు స్టేడియాల రూపురేఖలు మార్చడానికి సిద్ధమైంది. బీసీసీఐ చేతిలో నిధులు ఉన్నా.. దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం ఆధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఐదు స్టేడియాలకు రూ.500 కోట్లతో పునరుద్ధరణ పనులు చేయనున్నారు. ఈసారి వరల్డ్ కప్ కోసం దేశవ్యాప్తంగా 12 మైదానాలను బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది.

స్టేడియం

వన్డే వరల్డ్ కప్ స్టేడియాలకు నిధులు మంజూరు

రాజీవ్ గాంధీ స్టేడియానికి రూ.117.17 కోట్లు, ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌కి రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే స్టేడియానికి రూ.78.82 కోట్లను బీసీసీఐ ఖర్చు చేయనుంది. దీంతో ఈ స్టేడియాల రూపురేఖలు మారనున్నాయి. వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియాలో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు సమాచారం ఇక వరల్డ్ కప్ నాటికి స్టేడియాలు కొత్త హంగులతో దర్శనమివ్వనున్నాయి.