LOADING...
Ashwin - AB de Villiers: చైన్నైను వదిలిపెట్టొద్దని అశ్విన్ కు ముందే సూచించా : ఏబి డివిలియర్స్
చైన్నైను వదిలిపెట్టొద్దని అశ్విన్ కు ముందే సూచించా : ఏబి డివిలియర్స్

Ashwin - AB de Villiers: చైన్నైను వదిలిపెట్టొద్దని అశ్విన్ కు ముందే సూచించా : ఏబి డివిలియర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కొన్ని రోజులకే టీమిండియా స్టార్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌కీ వీడ్కోలు పలికాడు. చైన్నై సూపర్ కింగ్స్‌తో తన ఐపీఎల్ కెరీర్‌ను ఆరంభించిన అతడు మధ్యలో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్‌కి ముందే మళ్లీ సీఎస్‌కేలోకి చేరాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అశ్విన్‌ సీఎస్‌కేను వదిలి వేరే జట్లకు వెళ్లినప్పుడు తాను వద్దని చెప్పినట్లు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ వెల్లడించాడు. "అశ్విన్‌ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడిని నేను 'సైంటిస్ట్‌' అని పిలుస్తుంటా. క్రికెట్‌లో డాక్టర్‌, ప్రొఫెసర్‌లా అనేక పాత్రలు పోషిస్తాడు. రూల్‌బుక్‌లోని ప్రతి అంశంపై అతనికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎప్పుడూ నియమాలు అతిక్రమించడు.

Details

అశ్విన్ యెల్లో జెర్సీ ప్లేయర్ గానే కనిపిస్తాడు

ఆటను ఇంత లోతుగా అర్థం చేసుకొనే ఆటగాళ్లంటే నాకు చాలా గౌరవం. భారత క్రికెట్‌కు ఐకాన్ ప్లేయర్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు. సీఎస్‌కే తరఫున అద్భుతమైన బౌలింగ్‌తో మెప్పించాడు. ఇతర ఫ్రాంచైజీలకు ఆడినా, సీఎస్‌కేలోలాగా అతడు ఎక్కడా కుదురుకోలేకపోయాడు. నా దృష్టిలో అశ్విన్ ఎల్లప్పుడూ యెల్లో జెర్సీ ప్లేయర్‌గానే కనిపిస్తాడని ఏబీడీ వ్యాఖ్యానించాడు. 2008 నుంచి 2015 వరకు సీఎస్‌కే తరఫున ఆడిన అశ్విన్‌ 2016లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత పంజాబ్ కింగ్స్‌ (2018-19), ఢిల్లీ క్యాపిటల్స్‌ (2020-21), రాజస్థాన్‌ రాయల్స్‌ (2022-24) జట్లకు ఆడాడు.

Details

ఐఎల్‌టీ20 ఆక్షన్‌కు అశ్విన్ 

ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న అశ్విన్‌ ఇకపై విదేశీ లీగుల్లో ఆడతాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. తొలుత అతడు ఇంగ్లాండ్‌లోని 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడతాడని భావించినా, తాజా సమాచారం ప్రకారం అతడు యూఏఈలో జరగబోయే 'ఇంటర్నేషనల్ లీగ్ టీ20' (ILT20) టోర్నీలో ఆడనున్నాడు. ఇందుకోసం సెప్టెంబర్ 30న దుబాయ్‌లో జరగబోయే వేలం (ఆక్షన్) కోసం స్వయంగా పేరును నమోదు చేసుకున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. ఇప్పటికే ఈ టోర్నీ మూడు ఎడిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.