Ruturaj Gaikwad : కెప్టెన్సీలో ధోనీ స్టైల్ వేరే నా స్టైల్ వేరే : రుతురాజ్ గైక్వాడ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా గేమ్స్ లో తన పోరును ఆరంభించేందుకు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం నేపాల్‌తో టీమిండియా తలపడనుంది.
ఇప్పటికే ఆసియా క్రీడల్లో భారత మహిళ జట్టు స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణమే లక్ష్యంగా ఏషియన్ గేమ్స్ బరిలోకి దిగుతోంది.
భారత పురుషుల వన్దే ప్రపంచ కప్ ఆడనుండటంతో రుత్ రాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా గేమ్స్ కు బీసీసీఐ పంపింది.
ఈ సందర్భంగా కెప్టెన్ గైక్వాడ్ మాట్లాడుతూ కెప్టెన్సీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉందని పేర్కొన్నారు.
Details
ధోని నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి
ధోనీ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, కానీ ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఓ స్టైల్ ఉంటుందని, ఆయన వ్యక్తిత్వం వేరు తన వ్యక్తిత్వం వేరు అని గైక్వాడ్ పేర్కొన్నారు.
కొన్ని విషయాలను ధోనీ నుంచి నేర్చుకోవాలని, మ్యాచ్ సమయంలో ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి, మ్యాచ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ధోని దగ్గర తెలుసుకోవాలన్నారు.
ఎంఎస్ ధోని సారథ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుత్ రాజ్ గైక్వాడ్ కీలక సభ్యుడిగా ఎదిగిన విషయం తెలిసిందే.