LOADING...
Virat Kohli: బాత్రూమ్‌లో విరాట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు : యుజ్వేంద్ర చాహల్‌
బాత్రూమ్‌లో విరాట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు : యుజ్వేంద్ర చాహల్‌

Virat Kohli: బాత్రూమ్‌లో విరాట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు : యుజ్వేంద్ర చాహల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

జట్టు విజయం కోసం చివరి వరకు ప్రాణాలు పెట్టి పోరాడే తత్వం అతనిది. కానీ,కీలక సమయంలో జట్టు ఓడిపోతే ఆ బాధను తట్టుకోలేడు.అతడి నాయకత్వంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవకపోయినా,గొప్ప కెప్టెన్ల జాబితాలో స్థానం పక్కాగా ఉంటుంది. అతడే విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీ 2019వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో టీమిండియాకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఎంఎస్ ధోనీ,రవీంద్ర జడేజా చివరివరకు ప్రయత్నించినా,టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక ఫ్యాన్స్‌ మాత్రమే కాదు, జట్టులోని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఈఓటమి తరువాత విరాట్ బాత్రూమ్‌లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడని యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

వివరాలు 

మరో 15పరుగులు తక్కువగా ఇచ్చి ఉంటే..

గతంలో బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంలోనూ కోహ్లీ చాలా భావోద్వేగానికి లోనయ్యాడని గుర్తుచేస్తూ,చాహల్ ఇలా చెప్పాడు: ''2019 వరల్డ్ కప్ సమయంలో కోహ్లీ ఏడుపును నేను ప్రత్యక్షంగా చూశాను.అంతే కాదు,ఆ సమయంలో జట్టులో ప్రతి ఒక్కరూ ఆవేదనకు గురయ్యారు.నేనే చివరిగా క్రీజ్‌లో నుంచి వచ్చా.అప్పటికే కోహ్లీ కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. అది ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్. మేము మరో 15పరుగులు తక్కువగా ఇచ్చి ఉంటే.. బహుశా విజయం మనదే అయ్యుండేది.ఆ మ్యాచ్‌లో నేనూ ఇంకొంచెం మెరుగ్గా బౌలింగ్‌ చేసి ఉంటే బాగుండేదనిపించింది,'' అని చాహల్ విచారం వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో చాహల్ తన 10 ఓవర్లలో 63పరుగులు ఇచ్చి కేవలం ఒక్కవికెట్ మాత్రమే తీశాడు.