
Ashes Series-Joe Root: యాషెస్ సిరీస్ ముందు మ్యాథ్యూ హేడెన్ సవాల్: రూట్‌కు గ్రేస్ హేడెన్ విన్నపం
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్ ప్రపంచంలోని అత్యంత గౌరవప్రదమైన టెస్టు క్రికెట్ పోటీగా పేరొందింది. ఇంగ్లండ్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐదు టెస్టుల యాషెస్‌పై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఈ మ్యాచ్‌లలో సెంచరీ సాధించినా, ఐదు వికెట్లు తీసుకున్నా ఆటగాడు చిరస్మరణీయుడుగా నిలుస్తాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా యాషెస్ సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా హాట్‌గా మారాయి. దీంతో ప్రత్యర్థి బ్యాటర్‌ను కూడా సెంచరీ చేయమనే పరిస్థితి హేడెన్ కుమార్తెకు వచ్చింది. అసలు మ్యాథ్యూ హేడెన్ ఏమన్నాడు? ఆయన కుమార్తె గ్రేస్ హేడెన్ విన్నపం ఏంటో చూద్దాం..
వివరాలు
రూట్‌పై ఒత్తిడి పెంచేలా సవాల్ విసిరిన మ్యాథ్యూ హేడెన్
ప్రస్తుతం టెస్టుల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) రికార్డు చేరువకు వచ్చాడు. మిగిలిన 2,400 పరుగులు జోడిస్తే రికార్డు తనదే అవుతుంది. అందువల్ల రాబోయే యాషెస్ సిరీస్ జో రూట్‌కు చాలా కీలకం. అయితే ఆసీస్ మాజీ స్టార్ మ్యాథ్యూ హేడెన్ రూట్‌పై ప్రత్యేకంగా ఒత్తిడిని పెంచేలా వ్యాఖ్యానించారు. "యాషెస్ సిరీస్‌లో జో రూట్ ఒక సెంచరీ కూడా సాధించకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నగ్నంగా నడుస్తా" అని సోషల్ మీడియా ద్వారా సవాల్ విసిరారు.
వివరాలు
ప్లీజ్ రూట్… ఒక్క సెంచరీ అయినా చేయండి
ఈ కామెంట్లు భారీగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా గ్రేస్ హేడెన్, క్రీడా వ్యాఖ్యాత కూడా ఈ చర్చలో పాలుపంచుకున్నారు. గ్రేస్ హేడెన్ కామెంట్ సెక్షన్‌లో "ప్లీజ్ రూట్... ఒక్క సెంచరీ అయినా చేయండి" అని సరదాగా విన్నపం చేశారు. ఆసీస్ గడ్డపై జో రూట్‌కు ఇప్పటివరకు ఒక టెస్టు శతకం కూడా లేదని విషయం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆసీస్ బౌలర్లు రూట్‌ను ఎలా ఎదుర్కొంటారనేది అందరి ఆసక్తి. నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవ్వనుంది. మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.