Page Loader
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఫుల్ జోష్ లో ఉండగా, ఇంగ్లండ్ ఓటమి బాధతో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇరుజట్లు మ్యాచులో స్లో ఓవర్ రేటు మేయింటన్ చేసినందుకు ఆటగళ్ల మ్యాచ్ ఫీజులో 40శాతం కోత విధించింది. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు మ్యాచ్ రిఫరీ ఆండీ హైక్రాప్ట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు.

Details

ఇరు జట్లకు మ్యాచులో 20శాతం జరిమానా

ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆ జరిమానాను కట్టేందుకు అంగీకరించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఆటగాళ్లకు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయకపోతే ప్రతీ ఓవర్ కు వారి మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానా విధించడం అనవాయితీ. దీంతో రెండు ఓవర్లు లేటుగా వేసినందుకు మ్యాచ్ ఫీజులో 40శాతం జరిమానా విధించారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడే జట్లు స్లో ఓవర్ రేటుకు పాల్పడితే ఆర్టికల్ 16.11.12 ప్రకారం ఒక్కో ఓవర్ కు పాయింట్ల పట్టికలో ఒక పాయింట్ కోత విధిస్తారు.