
టీమిండియా- న్యూజిలాండ్ మ్యాచుకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.
ఇప్పటికే ఈ టోర్నీ లీగ్ దశ ముగిసింది. ఇక ఈ మెగా టోర్నీలో రెండు సెమీ ఫైనల్ మ్యాచులు, ఫైనల్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
భారత్, దక్షిణా ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్ కు చేరాయి.
ఈ నెల 15, 16 తేదీల్లో సెమీస్ మ్యాచులు జరుగుతుండగా, ఈ నెల 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి సెమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
Details
అంపైర్లను ప్రకటించిన ఐసీసీ
ఇక తాజాగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ కు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది.
రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ (ఇంగ్లండ్), రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) తొలి సెమీఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించనున్నారు.
ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది.
ఇక, వెస్టిండీస్ కు చెందిన జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్ గానూ, దక్షిణాఫ్రికాకు చెందిన ఆడ్రియన్ హోల్డ్ స్టాక్ ఫోర్త్ అంపైర్ గానూ వ్యవహరిస్తారని వెల్లడించింది.