ICC T20I Team Of The Year 2023: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసిన ఐసిసి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం నాడు పురుషుల T20I జట్టును ప్రకటించింది. భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సూర్యతో పాటు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లు చోటు దక్కించుకోవడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ T20I ఫార్మాట్‌లో 2023లో సంచలనం సృష్టించాడు. సూర్యకుమార్ 18 మ్యాచ్‌ల్లో 733 పరుగులు చేసి రెండు అద్భుతమైన సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతని సెంచరీ భారత్‌కు దక్షిణాఫ్రికాతో జరిగిన T20I సిరీస్‌ను 0-1తో డ్రా చేయడంలో సహాయపడింది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ముగ్గురు భారతీయులు జట్టులో ఉన్నారు.
ఐసీసీ టీ20 జట్టు ఇదే..
కేవలం 15 మ్యాచ్‌లలో 430 పరుగులు చేసిన స్వాష్‌బక్లింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్,సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి జట్టుకు ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. జైస్వాల్ 2023లో టీ20I లో సెంచరీ కూడా సాధించాడు.బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్,ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌లు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ అంచనాలకు మించి రాణిస్తుండగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్..ఈ ఫార్మాట్‌లో అవకాశం వచ్చినప్పుడల్లా రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్, మార్క్ చాప్‌మన్, సికందర్ రజా, అల్పేష్ రంజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ నగరవ, అర్ష్‌దీప్ సింగ్.