Champions Trophy: టీమిండియా ప్లేయర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ వేదికగా 2025 ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
అయితే బీసీసీఐ, ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌కు వెళ్లమని ఐసీసీకి స్పష్టంగా చెప్పింది.
మొదట్లో పాకిస్థాన్, భారత జట్టు తమ దేశంలో పర్యటించాల్సిందేనని పట్టుబట్టింది.
కానీ, ఐసీసీ చర్చల తర్వాత పాకిస్థాన్ తన వైఖరి మార్చి, హైబ్రిడ్ మోడ్‌ను అంగీకరించింది.
దీనివల్ల టీమిండియా మ్యాచులు దుబాయ్‌లో జరగనున్నాయి. దీని ద్వారా వివాదం ముగిసినట్లుగా భావించారు. టోర్నీకి ఎలాంటి ఆటంకాలు ఉండవని భావించారు.
వివరాలు
ప్లేయర్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండడంపై భారత్ అభ్యంతరం
అయితే, ఇప్పుడు మరొక వివాదం తలెత్తినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
భారత జట్టులోని ప్లేయర్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ పేరును జెర్సీపై ముద్రించలేమని బీసీసీఐ ఐసీసీకి తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఐసీసీ నిబంధనల ప్రకారం, మెగాటోర్నమెంట్లలో పాల్గొనే జట్ల జెర్సీపై ఆ టోర్నీ పేరు , ఆతిథ్య దేశం పేరు తప్పనిసరిగా ఉండాలి.
అయితే బీసీసీఐ, పాకిస్థాన్ పేరును జెర్సీపై ముద్రించలేమని తెలిపింది. భారత్ మ్యాచులు దుబాయ్ వేదికగా జరుగుతాయి కాబట్టి ఆతిథ్య దేశం పేరు అవసరం లేదని బీసీసీఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత షెడ్యూల్
ఐసీసీ నిబంధనల ప్రకారం, ప్లేయర్ల జెర్సీలపై టోర్నమెంట్ లోగోతో పాటు ఆతిథ్య దేశం పేరు ఉండాల్సిందే.
టీమిండియా ఈ నిబంధన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
భారత్ ఫిబ్రవరి 20న తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. గ్రూప్ దశలో భారత చివరి మ్యాచ్ మార్చి 2న జరగనుంది.