Page Loader
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 
జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. 2024 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు బుమ్రా ఎంపిక కాగా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్, శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్‌లను వెనక్కు నెట్టి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. అంతకుముందు ముందు రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) ఈ అవార్డును గెలుచుకున్నారు. 2024 ఐసీసీ టెస్టు జట్టులో కూడా బుమ్రా చోటు దక్కించుకోవడం విశేషం.

Details

స్మృతి మంధానకు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 

భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 2024 సంవత్సరానికి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డుకు దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ట్, శ్రీలంక సారథి చమరి ఆటపట్టు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పోటీ పడగా, మంధాన ఈ గౌరవాన్ని దక్కించుకుంది. ఇది మంధానకు ఈ అవార్డును గెలుచుకోవడం రెండోసారి. 2018లో తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్న ఆమె, న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ తర్వాత ఈ అవార్డును రెండుసార్లు అందుకున్న రెండోవ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 2024 సంవత్సరంలో స్మృతి మంధాన 13 వన్డేల్లో 57.46 సగటుతో 747 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.