Page Loader
T20 World Cup 2024: Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల
Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల

T20 World Cup 2024: Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌కు ఇంకో పది రోజులు మాత్రమే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు అన్ని జట్లు కూడా ఈ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ పొట్టి వరల్డ్ కప్ క్రేజ్‌ను మరింతగా పెంచేందుకు థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. 'వాటెవర్ ఇట్ టేక్స్' (Whatever It Takes) అనే టైటిల్‌తో, తెలుగులో 'ఏదైనా చేసేద్దాం' అని నామకరణం చేసిన ఈ పాట, వరల్డ్ కప్ ట్రోఫీతో ప్రారంభమవుతుంది. ఒక నిమిషం 40 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో,మహిళల క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన క్రీడాకారిణుల ప్రయాణాన్ని చూపిస్తుంది.

వివరాలు 

అఫీషియల్ సాంగ్ ద్వారా మహిళల క్రికెట్‌కు మరింత గుర్తింపు

అంతేకాక,ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న జట్లు, గతంలో ట్రోఫీని గెలుచుకున్న జట్ల విజయాల సంబరాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఫలితంగా, ఈ వీడియో చూసిన అభిమానులు వరల్డ్ కప్ ఉత్సాహంలో మునిగిపోతున్నారు. "మహిళల టీ20 వరల్డ్ కప్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ఐసీసీ కట్టుబడి ఉంది," అని ఐసీసీ జనరల్ మేనేజర్ క్లేర్ ఫర్లాంగ్ పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై మహిళల క్రికెట్‌కు మంచి పేరు తెచ్చుకుంది.అఫీషియల్ సాంగ్ ద్వారా మహిళల క్రికెట్‌కు మరింత గుర్తింపు, ప్రఖ్యాతి తీసుకురావడం మా లక్ష్యం. ఈ పాట, క్రికెటర్ల ప్రతిభకు ప్రతీక మాత్రమే కాకుండా, కొత్త తరానికి స్ఫూర్తిని అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ధికి,అభిమానులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది" అని క్లేర్ చెప్పారు.

వివరాలు 

అక్టోబర్ 3 నుండి టీ20 వరల్డ్ కప్

'వాటెవర్ ఇట్ టేక్స్' అనే అధికారిక పాటను బే మ్యూజిక్ సంస్థ రూపొందించింది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు మికే మెక్‌క్లియరీ, కంపోజర్ పార్థ్ పరేఖ్ పనిచేశారు. వరల్డ్ కప్ థీమ్ సాంగ్‌ను అన్ని రకాల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుండి యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. 17 రోజులపాటు అభిమానులను అలరించనున్న ఈ టోర్నీలో కొత్త విజేత ఎవరు కావచ్చు అన్న ఆసక్తి క్రీడా ప్రపంచంలో నెలకొని ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐసీసీ చేసిన ట్వీట్ ఇదే..