
Pakistan team: పాకిస్థాన్ జట్టుపై మరోసారి విరుచుకుపడ్డ ఐస్‌లాండ్ క్రికెట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది.
సొంతగడ్డపై కంగారు జట్టునూ ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాక్ క్రికెటర్లు, తొలి మ్యాచులోనే దారుణ పరాభావాన్ని మూటగట్టుకున్నారు.
ఏకంగా 360 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో మూడు మ్యాచుల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడ్డారు.
ఈ ఓటమి బాధలో ఉన్న పాక్ జట్టుపై మరోసారి ఐస్‌లాండ్ క్రికెట్ (Iceland Cricket)విరుచుకుపడింది.
పాకిస్తాన్ చివరిసారిగా 1995లో ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ గెలిచినప్పుడు తమ దేశంలో 45.6శాతం మంది జనాభా పుట్టలేదని, ఐస్‌లాండ్ క్రికెట్ X లో పోస్టు చేసింది.
Details
డిసెంబర్ 26న పాక్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు
డిసెంబర్ 22, 23 తేదీల్లో ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ముందు పాకిస్థాన్ జట్టు విక్టోరియా ఎలెవన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్ జరగనుంది.
ఆస్ట్రేలియా జట్టు ఇదే
పాట్ కమిన్స్ (సి), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచ్ స్టార్క్, డేవిడ్ వార్నర్.