Pakistan Cricket Borad: ఐసీసీ నష్ట పరిహారం చెల్లించాల్సిందే.. పాక్ క్రికెట్ బోర్డు వింత పోకడ!
2025 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కి పాక్ అతిథ్యమివ్వనుంది. ఇప్పటిదాకా ఆతిథ్య హక్కుల పత్రంపై ఐసీసీ (ICC) సంతకం చేయలేదు. ఒకవేళ ఈ టోర్నీలో భద్రతా కారణాల చెప్పి పాకిస్థాన్ (Pakistan)కు భారత జట్టు రాకపోతే ఐసీసీ నష్టపరిహారం చెల్లించాల్సిదేనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవల అహ్మదాబాద్‌లో పీసీబీ ఛైర్మన్ జకా అష్రాఫ్ ఐసీసీ (ICC) అధికారులతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. ఒకవేళ భద్రతా కారణాలతో పాక్ భారత్ ఆడటానికి నిరాకరిస్తే ఐసీసీ ఒక స్వాతంత్య్ర సెక్యూరిటీ ఏజెన్సీకి భద్రతను అప్పగించాలని, ఈ ఏజెన్సీ పాక్ పోలీసులతో కలిసి పని చేయాలని షరతు విధించారట.
ఇప్పటికే టాప్ జట్లు పాక్ లో పర్యటించాయి : పీసీబీ
గత రెండేళ్లలో భద్రత గురించి ఆందోళన లేకుండా టాప్ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఒకవేళ తమ దేశానికి భారత్ రాకపోతే దీనికి ఐసీసీ నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. గత ఆసియా కప్ సమయంలో పాకిస్థాన్ కు వెళ్లమని భారత్ తేల్చి విషయం తెలిసిందే. దీంతో ఆసియా కప్ మ్యాచులను భారత జట్టు శ్రీలంకలో ఐసీసీ నిర్వహించింది.