WTC : డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఆగ్రస్థానానికి వెళ్లాలంటే.. ఇలా జరగాల్సిందే!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టాప్ 2 స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీని విజయవంతంగా ప్రారంభించిన టీమిండియా టాప్ 1 స్థానానికి చేరుకుంది. అయితే పింక్ బాల్ టెస్టులో పరాజయంతో మూడో స్థానానికి పడిపోయింది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్‌కు టాప్ 1 స్థానాన్ని సాధించేందుకు అవకాశాలున్నాయి. భారత జట్టుకు టాప్ 1 స్థానాన్ని సాధించాలంటే ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది.
64.04 పర్సంటేజ్ తో భారత్ ముందుకెళ్లే అవకాశం
అలా చేస్తే 64.04 పర్సంటేజ్‌తో భారత్ ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఆసీస్ 55.26 పర్సంటేజ్ కన్నా ఎక్కువ సాధించలేదు. ప్రస్తుతం టాప్ 1 స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (63.33 శాతం) భారత జట్టు ప్రధాన పోటీదారిగా నిలుస్తోంది. దక్షిణాఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ సిరీస్‌ను 1-1తో ముగిస్తే, దక్షిణాఫ్రికా 61.11 శాతం పాయింట్లతో రిటైల్ అవుతుంది. అయితే దక్షిణాఫ్రికా 2-0 తేడాతో పాకిస్థాన్‌ను ఓడిస్తే, భారత్‌కు టాప్ 1 స్థానం దక్కదు. సఫారీలు అగ్రస్థానంలోకి వెళ్లి 69.44 శాతంతో ముందుకు వస్తారు.
దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల్లో ఓడితే ఆస్ట్రేలియా టాప్ 2లోకి
ఒకవేళ దక్షిణాఫ్రికా 1-0 తేడాతో పాకిస్థాన్‌ను ఓడిస్తే, వారికి 63.89 శాతం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో భారత్ 64.04 శాతంతో టాప్ 1లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక, ఒకవేళ దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లలో ఓడితే (52.78%) ఆస్ట్రేలియా టాప్ 2లోకి చేరుకుంటుంది. అప్పుడు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు కనిపించవచ్చు. ఈ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, టీమ్‌ఇండియాకు టాప్ 1 స్థానం చేరడం ఖాయం. లేకపోతే ఫైనల్ చేరడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.