
IPL 2025: ఐపీఎల్‌లో 500 పరుగులు చేస్తే.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత తరం యువ క్రికెటర్లలో తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌ల ఆటతీరును చూసి వారికీ అభిమానిగా మారిపోయానని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కారణంగా యువ క్రికెటర్లకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని, ఇక్కడ రాణిస్తే జాతీయ జట్టులో స్థానం పొందడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ ఇప్పుడు భారత్‌లో మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రికెట్ పండుగలా మారిపోయిందని వెల్లడించాడు.
వివరాలు
యువ క్రికెటర్లకు సురేశ్ రైనా సందేశం:
"ఇప్పటి క్రికెటర్లు అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నారు. భారత్ గతేడాది టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది,అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని సైతం దక్కించుకుంది. యువ ఆటగాళ్లు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. రోహిత్, విరాట్ తో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్లు అందరూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు క్రికెట్ లో కొత్త తరం ఆటగాళ్లు కనిపిస్తున్నారు. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, అక్షర్ పటేల్ లాంటి అద్భుతమైన టాలెంట్ గల క్రికెటర్లు వస్తున్నారు. అక్షర్ సారథిగానూ ఎంపికయ్యాడు.
వివరాలు
500+ పరుగులు చేయగలిగితే..
ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లకు నేను ఓ సూచన చేయాలనుకుంటున్నా..ఆటపై పూర్తిగా దృష్టిపెట్టండి,వర్తమానాన్ని ఆస్వాదించండి.నిరంతరం నిలకడగా ప్రదర్శన ఇస్తే,గుర్తింపు ఖాయం.ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో 500+ పరుగులు చేయగలిగితే, జాతీయ జట్టులో స్థానం దక్కడం తధ్యం.ప్రతి ఐపీఎల్ సీజన్‌ను ఈ అవకాశంగా ఉపయోగించుకోవాలి. ఆటలో ధైర్యం, క్రమశిక్షణ ఉండాలి. టెక్నిక్‌తోపాటు ఆటిట్యూడ్‌ను కూడా మెరుగుపర్చుకోవాలి. ఐపీఎల్‌లో రాణిస్తే, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు" అని సురేశ్ రైనా అన్నారు.
వివరాలు
ఐపీఎల్ ప్రపంచ టీ20 లీగ్‌లకు 'డాడీ' - రాబిన్ ఉతప్ప
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ,"ఐపీఎల్ రాకతో క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆటపై ఉన్న ఆసక్తి, అభిమానుల నిబద్ధత మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లు ఉన్నప్పటికీ, వాటన్నింటికంటే ఐపీఎల్‌నే 'డాడీ' అని అనటంలో సందేహం లేదు. ఐపీఎల్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం,లీగ్‌లో చోటుచేసుకునే ఆవిష్కరణలే.
వివరాలు
కనీసం 1000 సిక్సర్లు నమోదయ్యే అవకాశం: ఉతప్ప
గత సీజన్‌తో పోలిస్తే, ఈసారి మరింత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.
2025 ఐపీఎల్ సీజన్‌లో కనీసం 1000 సిక్సర్లు నమోదయ్యే అవకాశముంది. అంతేకాక, 300+ స్కోర్లు సాధించబడతాయని, 275+ పరుగుల లక్ష్య ఛేదన సైతం వీక్షించే అవకాశం ఉందని భావిస్తున్నా. వ్యక్తిగత స్కోర్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతాయి.ఒక్కో మ్యాచ్ సరికొత్త మజిలీని చూపించబోతోంది" అని ఉతప్ప వివరించాడు.
శనివారం నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది.