
BCCI: అభిమానుల బాయ్‌కాట్ ప్రభావం..? భారత్-పాక్ మ్యాచ్‌కు దూరంగా బీసీసీఐ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఈ ఆదివారమే జరగనుంది. అయితే ఇప్పటికే పాక్‌తో ఆడొద్దని భారత అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ నిర్ణయంలో మార్పులు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం ఆడాల్సిందేనని చెప్పినప్పటికీ అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు జాతీయ మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి. దుబాయ్‌కు బీసీసీఐ తరఫున కేవలం ఒక్క ప్రతినిధి మాత్రమే వెళ్లగా, మిగతావారు హాజరుకాలేదని సమాచారం.
Details
టికెట్లు కొనుగోలుపై ఆసక్తి చూపని ఫ్యాన్స్
అభిమానుల భారీ స్థాయి 'బాయ్‌కాట్ క్యాంపెయిన్' కారణంగానే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌ను చూసేందుకు బీసీసీఐ పెద్దలతో పాటు రాష్ట్ర సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కానీ, ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఈ మ్యాచ్‌కు బీసీసీఐ పెద్దలు దూరంగా ఉండటమే కాకుండా అభిమానుల నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. టికెట్లు అమ్ముడవకుండా మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ధరలు తగ్గించినా ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.