Page Loader
Paris Olympics 2024: ప్రైజ్‌మనీ పెంచండి.. ఒలింపిక్ విజేత స్వప్నిల్‌ తండ్రి డిమాండ్! 
ప్రైజ్‌మనీ పెంచండి.. ఒలింపిక్ విజేత స్వప్నిల్‌ తండ్రి డిమాండ్!

Paris Olympics 2024: ప్రైజ్‌మనీ పెంచండి.. ఒలింపిక్ విజేత స్వప్నిల్‌ తండ్రి డిమాండ్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత షూటర్ స్వప్నిల్ కుశాలే పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన 29 ఏళ్ల స్వప్నిల్, తన మొదటి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాడు. ఒలింపిక్ విజేతగా నిలిచిన స్వప్నిల్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. అయితే ఈ ప్రైజ్‌మనీపై అతని తండ్రి సురేశ్ కుశాలె అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వప్నిల్‌కు ఇచ్చిన రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీ చాలా తక్కువ అని పేర్కొన్నారు.

Details

రూ. 5 కోట్లు, ఓ ప్లాట్ ఇవ్వాలి

హర్యానా ప్రభుత్వం తమ అథ్లెట్లకు ఇచ్చిన ప్రైజ్‌మనీతో పోలిస్తే ఇది తక్కువ అని, తమ కొడుకు కోసం రూ. 5 కోట్లు, పుణెకు చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర ఒక ఫ్లాట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర నుంచి కాంస్య పతకం సాధించిన రెండో వ్యక్తి తన కుమారుడని, హరియాణా చిన్న రాష్ట్రం, కానీ వారు పెద్ద మొత్తంలో ప్రైజ్‌మనీ ఇచ్చారని, తమ రాష్ట్రానికి కూడా అంతే కావాలని ఆయన అభిప్రాయపడారు. స్వప్నిల్ కుశాలే కంబల్వాడి గ్రామానికి చెందిన వాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన, 2015 నుండి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు.