NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్! 
    తదుపరి వార్తా కథనం
    IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్! 
    రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20

    IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జట్టు బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.

    ఈ మూడు టీ20ల సిరీస్‌లో ఆఖరి నామమాత్రపు మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరగనుంది.

    రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌ ఇప్పటికే గెలిచిన నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బెంచ్‌ బలాన్ని పరీక్షించాలనే ఆలోచనలో ఉన్నారు.

    ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత తుది జట్టులో ప్రధాన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

    వివరాలు 

    తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం

    సంజూ శాంసన్,అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగనున్నారు. రెండో టీ20లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్ ఆడగా, సంజూ పెద్ద ఇన్నింగ్స్ ఆడటానికి సిద్దంగా ఉన్నాడు.

    సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు, ఇక హాఫ్ సెంచరీతో మెరిసిన తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా జట్టులో కొనసాగనున్నాడు.

    స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతని స్థానంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం దక్కనుంది.

    ఇదే జరిగితే ఉప్పల్ స్టేడియంలో ఇద్దరు తెలుగు ఆటగాళ్లు భారత తరఫున ఆడే వీలుంది.

    వివరాలు 

    బంగ్లాదేశ్‌తో మూడో టీ20కి భారత తుది జట్టు (అంచనా)

    రియాన్ పరాగ్,రింకూ సింగ్ కూడా జట్టులో తమ స్థానాలను కొనసాగించనున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో రవి బెంచ్‌కే పరిమితమయ్యాడు.

    ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు, అతని స్థానంలో హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నాడు. మయాంక్ యాదవ్ జట్టులో కొనసాగనున్నాడు.

    సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    క్రికెట్

    Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ నిరోషన దారుణ హత్య.. స్థానిక మీడియా ప్రకటన శ్రీలంక
    Cricket : టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సగటును కలిగిన బ్యాటర్లు వీరే ఇంగ్లండ్
    Asia Cup : భారత్ వర్సెస్ శ్రీలంక.. ఫైనల్‌లో గెలుపు ఎవరిదో? భారత జట్టు
    Vinod Kambli: నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025