IND vs ENG: తొలి వన్డేలో ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 249
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ జోస్ బట్లర్ (52; 67 బంతుల్లో 4×4),బెటికెల్ (51; 64 బంతుల్లో 3×4, 1×6)అర్ధశతకంతో ఆకట్టుకున్నారు.
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (43; 26 బంతుల్లో 5×4; 3×6) మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ, సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.
మరో ఓపెనర్ డకెట్ (32; 29 బంతుల్లో 6×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు.
అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. 3 కీలక వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరచాడు.
వివరాలు
ప్రారంభం మెరిసినా..!
జడేజా మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్, షమీ, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
ఇంగ్లండ్ ప్రారంభంలో టీమిండియాను కాసేపు భయపెట్టింది.ఓ వైపు సాల్ట్ వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుండగా,అతడికి డకెట్ చక్కని సహకారం అందించాడు.
హర్షిత్ రాణా వేసిన ఆరో ఓవర్లో మూడు సిక్సులు,రెండు ఫోర్లతో 26 పరుగులు బాదారు.
ఈ జోడీని హార్దిక్ పాండ్య విడగొట్టాడు.ఎనిమిదో ఓవర్ చివరి బంతికి సాల్ట్ భారీ షాట్ ఆడగా,బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ చేశాడు.
మూడో రన్ కోసం ప్రయత్నించిన సాల్ట్‌ను వద్దని డకెట్ వారించడంతో,సాల్ట్ రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాతి ఓవర్‌లోనే డకెట్,హ్యారీ బ్రూక్ (0) వికెట్లను హర్షిత్ రాణా పడగొట్టాడు.ఇంగ్లండ్ వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది.
వివరాలు
బట్లర్, బెటికెల్ అర్ధశతకాలు
అయితే మిడిలార్డర్‌లో వచ్చిన బట్లర్, బెటికెల్ క్రీజులో నిలదొక్కుకుంటూ ఆడారు.
అనవసర పరుగుల కోసం ప్రయత్నించకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ జోడీని అక్షర్ పటేల్ విడగొట్టాడు.
బట్లర్ అర్ధశతకం పూర్తి చేసుకున్న 33వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి, స్లిప్‌లో ఉన్న హార్దిక్ పాండ్య చేతికి చిక్కిపోయాడు.
అక్కడికి 10 ఓవర్ల తర్వాత జడేజా బౌలింగ్‌లో బెటికెల్ ఎల్బీగా వెనుదిరిగాడు.
చివర్లో జోఫ్రా ఆర్చర్ (21*; 18 బంతుల్లో 3×4,1×6) కొంత దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ మంచి స్కోరు సాధించింది.