IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20.. యువ భారత్‌కు ఎదురుందా..?
ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు శుభారంభం చేసింది. తొలి టీ20లో విజయం సాధించిన భారత్, రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఐర్లాండ్ జట్టు విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. గాయం తర్వాత తిరిగొచ్చిన జస్పిత్ బుమ్రా చక్కటి ప్రదర్శనతో అకట్టుకుంటున్నాడు. మరో పేసర్ ప్రసిద్ధ కృష్ణ కూడా ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే మొదటి టీ20లో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్, మళ్లీ తిరిగి పుంజుకొని 139 పరుగులు చేయగలడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అయితే మధ్య ఓవర్లలో భారత బౌలర్లు చెలరేగాల్సిన అవసరం ఉంది.
ఐర్లాండ్ జట్టులోనూ ప్రమాదకక హిట్టర్లు
మొదటి టీ20లో టీమిండియా ఇన్నింగ్ సాగింది 6.5 ఓవర్లే కాబట్టి, బ్యాటర్ల ప్రదర్శన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ చక్కగా రాణించినా, తిలక్ వర్మ డకౌట్ కావడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. మరోవైపు ఐర్లాండ్ జట్టులోనూ ప్రమాదకర హిట్టర్లు ఉన్నారు. స్టిర్లింగ్, బాల్ బిర్ని, టెక్టార్ వంటి సీనియర్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ లో లిటిల్, యంగ్, క్యాంఫర్ కీలకంగా మారనున్నారు. మ్యాచ్ నేటి రాత్రి 7: 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.