WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు?
అమెరికా ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమంగా మారింది. 5వ టీ20 ఆదివారం జరగనున్న నేపథ్యంలో రెండు జట్లు సిరీస్‌పై కన్నేశాయి. చివరి టీ20లో విజయం సాధించాలని అటు వెస్టిండీస్, ఇటు టీమిండియా ఉవ్విళ్లూరుతున్నాయి. ఈరోజు రాత్రి 8గంటల నుంచి ఫ్లోరిడా వేదికగా 5వ టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఆడకపోవచ్చని చెబుతున్నారు. అతని స్థానంలో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఆడనున్నాడని వినిపిస్తోంది. ఫ్లోరిడా పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున ఈ మార్పు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
వెస్టిండీస్ జట్టులో మార్పు?
అలాగే అటు వెస్టిండీస్ లోనూ ఆటగాళ్ళ మార్పు జరగనుందట. నాలుగో టీ20లో సరైన ఆటతీరును ప్రదర్శించలేకపోయిన స్మిత్ ని 5వ మ్యాచకు దూరం పెట్టనున్నారని వినిపిస్తోంది. అతని స్థానంలో అల్జారీ జోసెఫ్ ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. వెస్టీండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు రెండు టెస్టుల సిరీస్ ని కైవసం చేసుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్‍ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఐదు టీ20ల సిరీస్‌ని అందుకుని క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటుంది.