Champions Trophy 2025: సెమీస్‌కు భారత్, పాక్ ఖాయం.. ఆసీస్‌కు కష్టమే: షోయబ్ అక్తర్
ఈ వార్తాకథనం ఏంటి
పదకొండు రోజుల్లోనే క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుండగా, పాకిస్థాన్ ఈ సారి ఆతిథ్య హోదాలో ఉంది. అయితే భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది.
ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పోటీ పడుతుండగా, సెమీఫైనల్‌కు అర్హత సాధించే నాలుగు జట్ల గురించి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన విశ్లేషణను వెల్లడించాడు.
అయితే ఆసక్తికరంగా ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాను తన టాప్ 4 జాబితాలో చేర్చలేదు.
Details
ఉపఖండం నుంచి మొత్తం మూడు జట్లు
అఫ్గానిస్థాన్ కాస్తా మరింత స్థిరత ప్రదర్శిస్తే, ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరడం ఖాయమన్నారు.
ఇక తన లిస్టులో భారత్, పాకిస్థాన్ తప్పకుండా ఉంటాయని, ఉపఖండం నుంచి మొత్తం మూడు జట్లు సెమీస్‌కు చేరే అవకాశాలు ఎక్కువ అని చెప్పారు.
ఫిబ్రవరి 23న పాక్ భారత్‌ను ఓడిస్తుందని భావిస్తున్నా చివరగా ఫైనల్‌లో కూడా ఇదే రెండు జట్లు తలపడే అవకాశం ఉందన్నారు. ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరడం కష్టమేనని చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
Details
ప్రమోషన్ వీడియో రిలీజ్
లాహోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్, షహీన్ షా అఫ్రిది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, పీసీబీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో పురుష క్రికెటర్లతో పాటు పాక్ మహిళా క్రికెటర్లు ఫాతిమా సనా, సదియా ఇక్బాల్ కూడా కనిపించారు.
అంతేకాక అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ టోర్నీకి ప్రత్యేకమైన అధికారిక సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటను పాకిస్థానీ ప్రముఖ గాయకుడు అతిఫ్ అస్లామ్ ఆలపించాడు.