LOADING...
IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం
బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం

IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2024
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు మరోసారి అద్భుత విజయాన్ని సాధించింది. మ్యాచ్‌కు మొదటి రెండు రోజులు వర్షం అడ్డంకిగా మారినా, కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. అయినప్పటికీ టీమిండియా అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేయడంలో భారత్ విజయం సాధించింది. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (8), గిల్‌ (6) పెవిలియానికి చేరినా, యశస్వి జైస్వాల్‌ (51) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడి, విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Details

18వ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

అతనితో పాటు విరాట్‌ కోహ్లీ (29*) రాబట్టి విజయవంతంగా మ్యాచ్‌ను ముగించారు. జైస్వాల్‌ మూడు పరుగులు అవసరమైన సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత్ గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 233 పరుగులు చేయగా, భారత్‌ 285/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ గెలుపుతో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే సమయంలో స్వదేశంలో భారత్ వరుసగా 18వ సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.