
Paris Paralympics 2024 :పారాలింపిక్స్'లో 29 పతకాలతో 18వ స్థానంలో భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. అసమాన పోరాటంతో పారా విశ్వ క్రీడల (Paralympics) రికార్డులను తిరగరాశారు.
ఈ క్రీడా పండుగ చరిత్రలోనే దేశానికి అత్యధిక పతకాలు అందించారు. ఈ వేడుకలలో భారత ఖాతాలో 29 పతకాలు చేరాయి.ఇది మునుపెన్నడూ సాధించని విజయమే.
పారిస్‌లో భారత క్రీడాకారులు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించడంతో , ఈసారి ఇండియా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది.
పారిస్‌కి వెళ్లేముందు, భారత పారాలింపిక్స్ కమిటీ 25 పతకాలు సాధిస్తామని ప్రకటించింది. అయితే దానికి నాలుగు పతకాలు ఎక్కువగా సాధించారు.
జావెలిన్ త్రోలో నవ్‌దీప్ సింగ్ స్వర్ణంతో గర్జించాడు, దీంతో భారత పతకాల సంఖ్య 29కి చేరింది.
వివరాలు
పతకధారులుగా హర్వీందర్ సింగ్, ప్రీతి పాల్
ఈసారి అథ్లెట్లు మొత్తం 17 మెడల్స్ సాధించారు. పారాలింపిక్స్ ముగింపు వేడుకలు ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆర్చర్ హర్వీందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్‌లు పతకధారులుగా వ్యవహరించున్నారు.
హర్వీందర్ ఆర్చరీలో తొలి స్వర్ణాన్ని సాధించగా, ప్రీతి అథ్లెటిక్స్‌లో రెండు కాంస్యాలతో ప్రభంజనం సృష్టించింది.