
Pakistan: ఇండియా మంచి గిఫ్ట్‌ను ఇచ్చింది.. ధన్యవాదాలు : పాకిస్థాన్ కోచ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ సూపర్ మ్యాచులో టీమిండియా చేతుల్లో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇండియాపై పాకిస్థాన్ కు ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం.
ఏకంగా భారత జట్టు 228 పరుగుల తేడాతో గెలుపొందింది.
అయితే ఇలాంటి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు భారత జట్టుకు థ్యాంక్స్ అంటూ పాకిస్థాన్ హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్ మ్యాచ్ అనంతరం షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇండియా చేతుల్లో ఓటమి పాకిస్థాన్ జట్టుకు ఓ గుణపాఠంలా పనికొస్తుందని అతను పేర్కొన్నాడు
Details
మళ్లీ పాకిస్థాన్ జట్టు గాడిలో పడుతుంది
గత రెండు రోజుల్లో తమకు అందిన గిప్ట్ కు కృతజ్ఞులుగా ఉంటామని, తరచూ ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్స్ తో ఆడే అవకాశం తమకు దక్కదని, అందువల్ల తమకు సమయానికి దక్కిన గుణపాఠంలా భావిస్తున్నామని గ్రాండ్ బ్రాడ్ బర్న్ తెలిపాడు.
ఈ మ్యాచులో తాము అన్ని రంగాల్లో విఫలం చెందామని, ఇందులో ఎలాంటి సాకులు లేవని, టీమిండియా బ్యాటర్లు ఎదురుదాడి చేయడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని, మళ్లీ పాకిస్తాన్ జట్టు గాడిలో పడుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు.
వాస్తవానికి పాకిస్థాన్ జట్టుకు ఇలాంటి ఓటమి ఇటీవలి కాలంలో ఎదురు కాలేదు.