LOADING...
ENG vs IND: ఇంగ్లండ్‌కు అనుకూలమైన నిర్ణయాలు? భారత్ మండిపాటు.. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు 
ఇంగ్లండ్‌కు అనుకూలమైన నిర్ణయాలు? భారత్ మండిపాటు.. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు

ENG vs IND: ఇంగ్లండ్‌కు అనుకూలమైన నిర్ణయాలు? భారత్ మండిపాటు.. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్-భారత్‌-జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే ఇరుజట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేశాయి. లార్డ్స్ టెస్టు నుంచి ఆటగాళ్ల మధ్య మొదలైన వివాదం, మాంచెస్టర్‌ మ్యాచ్‌లోనూ కొనసాగింది. తాజా వివాదంతో ఇప్పుడు వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈసారి వివాదానికి కారణంగా ఓవల్ మైదానం క్యురేటర్ ప్రవర్తన నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ మ్యాచ్ అధికారులపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. సమస్యను మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవలి వరుస వివాదాలతో ఈ టెస్టు సిరీస్ మరింత ఉత్కంఠగా మారింది.

వివరాలు 

35 ఓవర్ల బంతి ఇచ్చారా? 

ప్రారంభంలో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌,అనంతరం డ్రా అంశంపై చర్చలు,తర్వాత కోచ్, క్యురేటర్ మధ్య వాగ్వాదం... తాజాగా బంతుల మార్పు అంశం భారత్‌కు అసంతృప్తిని కలిగించింది. ఈ టెస్టు సిరీస్ మొత్తం భారత జట్టు బంతి మార్పు పట్ల తరచుగా అభ్యంతరం వ్యక్తం చేసింది. డ్యూక్స్ బంతులు త్వరగా ఆకారం కోల్పోతున్నాయని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా లార్డ్స్ టెస్టులో కేవలం 10ఓవర్లకే బంతిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా, బదులుగా ఇచ్చిన బంతి మాత్రం 35 ఓవర్లు ఆడిన పురాతన బంతిగా ఉందని భారత మేనేజ్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. బంతిని మార్చే తుది అధికారం ఫీల్డ్ అంపైర్లకు ఉన్నప్పటికీ, ఈ విషయంలో ఇంగ్లాండ్‌కు అనుకూలంగా వ్యవహరించారని భారత జట్టు భావిస్తోంది.

వివరాలు 

35 ఓవర్ల బంతి ఇచ్చారా? 

ఈ విషయం మీద ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ దృష్టికి తీసుకెళ్లింది. వాళ్ల వాదన ప్రకారం, కేవలం 10 ఓవర్లు ఆడిన బంతికి బదులుగా ఎక్కువగా వాడిన పాత బంతిని ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడింది. దీనివల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరిస్థితులు అనుకూలంగా మారాయని ఆరోపించింది.

వివరాలు 

ప్రభావం ఇలా.. 

లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరికి 22 పరుగుల తేడాతో భారత్ పరాజయం పొందింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 387 పరుగులు చేసి సమానంగా నిలిచాయి. అయితే ఇంగ్లాండ్ 271/7 వద్ద ఉన్న సమయంలో బంతిని మార్చారు.ఆ సమయంలో జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ అర్ధశతకాలు సాధించారు. పాత బంతి కారణంగా బౌలింగ్‌పై మెరుపు ప్రభావం తగ్గిపోయిందని, ఫలితంగా భారత బౌలర్లకు దిగువ బ్యాటర్లను త్వరగా ఔట్ చేయడం కష్టమైందని భావిస్తున్నారు. అయితే స్మిత్-కార్స్ జోడీ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అదే ఇంగ్లాండ్ విజయానికి దోహదపడింది. భారత్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి ఓటమి తప్పలేదు.