IND Vs BAN: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ సమయంలో భారత జట్టు 9 వికెట్లు కోల్పోయింది. ఈ స్కోరుతో భారత్ 52 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (72), కెఎల్ రాహుల్ (68), విరాట్ కోహ్లీ (47), శుభ్‌మన్ గిల్ (39) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులతో దూకుడిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్
భారత్ ఒక దశలో కేవలం 16 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హాసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ తమ స్పిన్ మాయాజాలంతో భారత పతనాన్ని శాసించారు. వీరిద్దరూ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.