IND vs PAK: ఆటలో కాదు.. మాటల్లోనూ హీటెక్కించే భారత్ - పాక్ మ్యాచ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంతో బోణీ కొట్టగా, డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ మాత్రం న్యూజిలాండ్ చేతిలో పరాభవం చవిచూసింది.
పాక్ జట్టులోఫకర్ జమాన్ గాయంతో జట్టుకు దూరం కావడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత జట్టును ఢీకొట్టేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది.
ఆదివారం జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్‌పై క్రికెట్ ప్రేమికుల ఆసక్తి నెలకొంది.
ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచుల్లో ఎన్నో వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయి. అలాంటి కొన్ని ఘటనలను గుర్తుచేసుకుందాం.
Details
జావెద్ మియాందాద్ - కిరణ్ మోరె వివాదం (1992)
1992 వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాక్ తలపడిన మ్యాచ్‌లో వికెట్ల వెనుక కిరణ్ మోరె మాటలు చెబుతుండటంతో, జావెద్ మియాందాద్ కోపం తెచ్చుకుని మోరెను అనుకరిస్తూ కంగారు లాగేలా ప్రవర్తించాడు.
ఇది భారత సారథి అజారుద్దీన్‌కు అసహనాన్ని కలిగించింది.
వెంకటేశ్ ప్రసాద్‌పై ఆమిర్ సోహైల్ స్లెడ్జింగ్ (1996)
1996 ప్రపంచకప్‌లో పాక్ ఓపెనర్ ఆమిర్ సోహైల్, వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌ను ఎదుర్కొని బౌండరీ కొట్టాడు. అనంతరం తన బ్యాట్‌తో బౌండరీ దిశగా చూపిస్తూ స్లెడ్జింగ్ చేశాడు.
అయితే వెంటనే ఆగ్లీ బంతికే సోహైల్‌ను అవుట్ చేసిన ప్రసాద్, పాక్ అభిమానులను షాక్‌కి గురి చేశాడు.
Details
ఇంజమామ్‌ను 'ఆలూ' అన్న అభిమాని (1997)
1997లో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా, ఓ అభిమాని పదేపదే 'ఆలూ' (బంగాళదుంప) అంటూ కామెంట్ చేశాడు.
కోపం తెచ్చుకున్న ఇంజమామ్, డ్రెస్సింగ్ రూమ్ నుంచి బ్యాట్ తెప్పించి ఆ అభిమానికి హెచ్చరిక ఇచ్చాడు.
ఈఘటనపై ఐసీసీ ఆయనను మందలించింది.
గౌతమ్ గంభీర్ - షాహిద్ అఫ్రిది వాగ్వాదం (2007)
2007లో జరిగిన భారత్ - పాక్ మ్యాచ్‌లో అఫ్రిది బౌలింగ్‌లో గంభీర్ బౌండరీ కొట్టాడు.దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై, వాగ్వాదం పెద్దదిగా మారింది.
ఫీల్డ్ అంపైర్ జోక్యంతో పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా, సోషల్ మీడియాలో తరచూ వివాదాలు కొనసాగడం విశేషం.
Details
షోయబ్ అక్తర్‌కు హర్భజన్ సింగ్ 'సిక్స్' సంబరం (2010)
2010 ఆసియా కప్‌లో హర్భజన్ బ్యాటింగ్ చేస్తుండగా, షోయబ్ అక్తర్ డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచాడు.
దీంతో స్లెడ్జింగ్‌కు దిగాడు. కానీ, చివరి ఓవర్‌లో ఆమిర్ వేసిన బంతిని హర్భజన్ సిక్స్‌గా మలిచి భారత్‌ను గెలిపించాడు.
తర్వాత అక్తర్ దగ్గరకు వెళ్లి ఉల్లాసంగా సంబరాలు చేసుకున్నాడు. ఇది అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.