రిజర్వే డేలో కూడా వర్షం గండం.. మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచులు చూడాలనకున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుకు వరుణుడు అటంకం కలిగించడంతో ఫలితం లేకుండానే ఆ మ్యాచ్ ముగిసింది.ఇక సూపర్ 4 దశలో జరుగుతున్న మ్యాచుకు కూడా వరణుడు ముంచేత్తాడు. దీంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను రిజర్వే డే అయినా సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం కూడా కొలంబోలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ లో కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగితేనే డీఎల్ఎస్ విధానంలో విజేతను నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది.
మ్యాచ్ రద్దయ్యే అవకాశం
రిజర్వే డే రోజు పాకిస్థాన్ మ్యాచ్ ఇన్నింగ్స్ కనీసం 20 ఓవర్లు కూడా జరగకపోతే ఈ మ్యాచును అంపైర్లు రద్దు చేస్తారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ను అందిస్తారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించారు. పాక్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ (56), గిల్(58) పరుగులు చేసి ఔట్ అయ్యారు. వీరిద్దరూ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో భారత్ పై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.