Page Loader
Champions Trophy 2025: 'ఆల్‌ ఆన్ ది లైన్' క్యాంపెయిన్‌లో.. హార్దిక్‌ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు
'ఆల్‌ ఆన్ ది లైన్' క్యాంపెయిన్‌లో.. హార్దిక్‌ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Champions Trophy 2025: 'ఆల్‌ ఆన్ ది లైన్' క్యాంపెయిన్‌లో.. హార్దిక్‌ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తారు. చివరిసారిగా 2013లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, అప్పట్లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ విజయాన్ని సాధించింది. ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.

వివరాలు 

హార్దిక్‌ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు 

ఈ టోర్నీకి సంబంధించిన ఐసీసీ లాంచ్ చేసిన 'ఆల్‌ ఆన్ ది లైన్' క్యాంపెయిన్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాతో పాటు ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ నబీ, పాకిస్థాన్ పేసర్ షహీన్ అఫ్రిది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్య మాట్లాడుతూ, "భారత క్రికెట్ బ్రాండ్‌ను ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐకానిక్ టోర్నీ తిరిగి ప్రారంభమవ్వడం క్రికెట్‌కు మంచి బూస్ట్. వన్డే ఫార్మాట్‌కు ఇది మరింత ప్రాధాన్యం తీసుకురానుంది. మా ఆటను అభిమానులకు చూపించేందుకు జట్టంతా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది" అని అన్నాడు.

వివరాలు 

ఇది గొప్ప గౌరవం: ఫిల్ సాల్ట్ 

ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాట్లాడుతూ, "ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచేందుకు ఇంగ్లండ్‌ చివరి వరకూ పోరాడుతుంది. ఈ జట్టులో భాగంగా ఆడటం నాకు గౌరవంగా అనిపిస్తోంది. ఇది కఠినమైన టోర్నీ. ప్రతి దశలోనూ తీవ్ర పోటీ ఎదురవుతుంది" అని చెప్పాడు. మొదటి ప్రయత్నం: నబీ అఫ్గానిస్తాన్‌కు ఇది తొలి ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ జట్టు ఆల్‌రౌండర్ నబీ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, "మేము అత్యుత్తమ జట్లతో పోటీపడేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాం. ఇది మా జట్టుకు గొప్ప అవకాశం" అని పేర్కొన్నాడు.

వివరాలు 

క్రికెట్‌ అంటే మాకు అంతకుమించి: షహీన్ అఫ్రిది 

పాకిస్థాన్ పేసర్ షహీన్ అఫ్రిది మాట్లాడుతూ, "క్రికెట్‌ మా గౌరవం, మా గుర్తింపు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగడం చాలా ప్రత్యేకం. ఫిబ్రవరి 19 కోసం పాకిస్థాన్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మా కోసం క్రికెట్‌కంటే ముఖ్యమైనది మరేదీ లేదు" అని భావోద్వేగంతో చెప్పాడు.