Page Loader
India's 2025 cricket schedule: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఇంగ్లాండ్ పర్యటన.. 2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..!
2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..!

India's 2025 cricket schedule: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఇంగ్లాండ్ పర్యటన.. 2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

2024 సంవత్సరాన్ని మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో ఓటమితో ముగించిన టీమిండియా, సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. ఈ టెస్ట్‌ జనవరి 3 నుంచి 7 వరకు జరుగనుంది. ఆ తర్వాత భారత్, ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జనవరి 22 నుంచి భారత్‌లో పర్యటిస్తుంది.

వివరాలు 

ఇంగ్లండ్‌ టూర్‌ షెడ్యూల్‌  

జనవరి 22: తొలి టీ20 (కోల్‌కతా) జనవరి 25: రెండో టీ20 (చెన్నై) జనవరి 28: మూడో టీ20 (రాజ్‌కోట్‌) జనవరి 31: నాల్గో టీ20 (పూణే) ఫిబ్రవరి 2: ఐదో టీ20 (ముంబై) ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌) ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ తర్వాత, భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ (వన్డేలు)లో పాల్గొంటుంది. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ ఈ విధంగా ఉంటుంది:

వివరాలు 

ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌

ఫిబ్రవరి 20: భారత్‌ vs బంగ్లాదేశ్‌ (దుబాయ్‌) ఫిబ్రవరి 23: భారత్‌ vs పాకిస్తాన్‌ (దుబాయ్‌) మార్చి 2: భారత్‌ vs న్యూజిలాండ్‌ (దుబాయ్‌) గ్రూప్‌ దశలో ఫలితాల ఆధారంగా సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్‌ 2025 జరుగుతుంది.

వివరాలు 

టీమిండియా ఇంగ్లండ్‌లో..

ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం, టీమిండియా ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌ జూన్‌ 20 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌ ఈ విధంగా ఉంటుంది: జూన్‌ 20-24: తొలి టెస్ట్‌ (లీడ్స్‌) జులై 2-6: రెండో టెస్ట్‌ (బర్మింగ్హామ్‌) జులై 10-14: మూడో టెస్ట్‌ (లండన్‌, లార్డ్స్‌) జులై 23-27: నాల్గో టెస్ట్‌ (మాంచెస్టర్‌) జులై 31-ఆగస్ట్‌ 4: ఐదో టెస్ట్‌ (లండన్‌, కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌) ఈ షెడ్యూల్‌ ప్రకారం, టీమిండియా బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది, కానీ వీటికి సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.

వివరాలు 

2025లో టీమిండియా ఆడే వన్డేలు

ఇంగ్లండ్‌తో: 3 ఛాంపియన్స్‌ ట్రోఫీలో: 5 బంగ్లాదేశ్‌తో: 3 ఆస్ట్రేలియాతో: 3 సౌతాఫ్రికాతో: 3 2025లో టీమిండియా ఆడే టెస్ట్‌లు: ఆస్ట్రేలియాతో: 1 (బీజీటీ) క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఇంగ్లండ్‌తో: 5 వెస్టిండీస్‌తో: 2 సౌతాఫ్రికాతో: 2