తదుపరి వార్తా కథనం

India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు
వ్రాసిన వారు
Stalin
Nov 12, 2023
09:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కప్ 2023లో టీమిండియా తన విజయ పరంపరను కొనసాగించింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది.
బెంగళూరులో క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 160 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 410 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
ఈ క్రమంలో 411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
160 పరుగుల తేాడాతో విజయం
ICC World Cup | India beat Netherlands by 160 runs at M.Chinnaswamy Stadium, Bengaluru. pic.twitter.com/bEUtHRhSNx
— ANI (@ANI) November 12, 2023