Page Loader
Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం 
పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం

Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ, కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని ఇప్పటికే బీసీసీఐ (BCCI) స్పష్టంగా చెప్పింది. ఈ విషయాన్నిఐసీసీ (ICC) పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది.దీంతో పాక్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. హైబ్రిడ్ మోడల్‌ ను అంగీకరించడం లేదని పైగా గంభీరంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఒకవేళ టోర్నీ రద్దు అయితే ఆర్థిక నష్టం తప్పదు. భారత్‌ లేకుండా టోర్నీ నిర్వహించినా,ఆడించినా ఫలితమే అంతే.ఈ కారణంతో,ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వంకు అప్పగించాలనే నిర్ణయానికి పీసీబీ (PCB) వచ్చింది.

వివరాలు 

షెడ్యూలింగ్ పేరుతో టోర్నీని రద్దు చేయాలని ఐసీసీ

ఈ మేరకు ఐసీసీ పంపించిన ఈ-మెయిల్‌ను పీసీబీ ప్రభుత్వానికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. పీసీబీ వర్గాలు తెలిపిన మేరకు, ''ఐసీసీ నుంచి మాకు మెయిల్ వచ్చింది. బీసీసీఐ తన జట్టును పంపడం లేదని అందులో పేర్కొనబడింది. ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా పాకిస్తాన్‌కు రాదు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి పీసీబీ పంపింది. ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాల ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకోబడుతుంది'' అని చెప్పారు. ఇక మరోవైపు, పాక్ ఇప్పటికే టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఐసీసీ మాత్రం షెడ్యూలింగ్ పేరుతో టోర్నీని రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

టీమ్ ఇండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు అంగీకరించని బీసీసీఐ

హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్తాన్ అంగీకరిస్తే, భారత్‌ ఆడే మ్యాచ్‌లను దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే, భారత్‌ నిర్ణయాన్ని పాక్ క్రికెటర్‌ రషీద్ లతీఫ్‌, ఇంజమాముల్‌ హక్ తీవ్రంగా తప్పుబట్టారు. బీసీసీఐ ఐసీసీ టోర్నీలను ఓ జోక్‌గా మార్చేసిందని విమర్శించారు. పాకిస్తాన్‌కు భారత్ జట్టు వస్తే సకల మర్యాదలతో ఆహ్వానిస్తామని పాక్ కెప్టెన్ రిజ్వాన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ భద్రత సంబంధిత కారణాల వల్ల, బీసీసీఐ టీమ్ ఇండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు అంగీకరించడం లేదు.